Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 January 2025, 5:23 pm Posted by : ramakrishna

ఘనంగా చెరుకు అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం

ఎల్లారెడ్డి, బతుకమ్మ: పట్టనంలోని మర్కల్ అశోక్ గార్డెన్స్ లో గురువారం చెరుకు అభివృద్ధి కమిటీ (సీడీసీ) ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిధి గా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ హాజరయ్యారు. చైర్మనగా ఇర్షాద్ఉద్దిన్, డైరెక్టర్లుగా పీర్ రెడ్డి, నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానికంగా ఫ్యాక్టరీ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఉంటుంది కానీ

Sugarcane Development Committee swearing in solemnly

ఎప్పుడు కూడా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన ఏ ఒక్క నాయకుడు కూడా దీనికి ఛైర్మన్ కాలేదని తెలిపారు. ఎమ్మెల్యే దీని కోసం 9 నెలలుగా సీఎం, మంత్రి తో వ్యక్తిగతంగా మాట్లాడి ఎంతో మందితో కొట్లాడితే ఈ పదవి వచ్చిందని తెలిపారు. గత ప్రభుత్వాలు నియోజకవర్గాన్ని 10 యేండ్లు వెనకకి నెట్టేసాయని తెలిపారు. ఇప్పుడిప్పుడే దారిన పెడ్తున్నామని అన్నారు. చెరుకు రైతులకు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్నీ విధాలుగా రైతులకు సహాకరించాలని ఛైర్మన్కి, గాయత్రి షుగర్స్ యాజమాన్యానికి తెలిపారు.

Sugarcane Development Committee swearing in solemnly