వెబ్ న్యూస్, బతుకమ్మ : హర్యానా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆసియాలోని పెద్ద షుగర్ మిల్లుగా పేరుగాంచిన యుమునానగర్ లోని సరస్వతీ షుగర్ మిల్ ప్రాంగణంలోకి నీరు చేరింది. యుమునానగర్ ప్రాంతంలోని గిడ్డంగిలో 2.2 లక్షల కింటళ్ల పంచదారను నిల్వ చేశారు. దీని విలువ సుమారు 97 కోట్లు. రాత్రికి రాత్రే కురిసిన భారీ వర్షాల కారణంగా పక్కన ఉన్న కాల్వ పొంగి నీరు మిల్లులోకి చేరిందని మిల్లు జనరల్ మేనేజర్ రాజీవ్ మిశ్రా వెల్లడించారు. దీంతో క్వింటాళ్ల కొద్ది పంచదార తడిసిపోయి కరిగిపోయింది. దాని విలువ రూ. 50 నుంచి 60 కోట్ల వరకు ఉంటుందని ఆయన తెలిపారు. గిడ్డంగి మొత్తాన్ని పరిశీలించి పూర్తి నష్టం వెల్లడిస్తామన్నారు.