Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 February 2026, 4:53 pm Posted by : ramakrishna

సహకారం సంఘంలో సుదర్శన్ చేసిన సేవలు మరువలేని

 

. . . నిజాయితీకి మారు పేరు ఈగ సుదర్శన్

 

రుద్రూర్, బతుకమ్మ :

 

నిజాయితీగా నిస్సాహాయంగా పనిచేసిన వ్యక్తి ఈగ సుదర్శన్ అని, సహకార సంఘంలో ఆయన చేసిన సేవలు మరువ లేనివని సహకార సంఘం మెంబర్లు, రైతులు పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో స్టాప్ మెంబర్ గా విధులు నిర్వహిస్తున్న ఈగ సుదర్శన్ శనివారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా సహకార సంఘం ఆధ్వర్యంలో పదవీ విరమణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ ఇందూరి సునీత చంద్రశేఖర్, సహకార సంఘ మెంబర్లు, సిబ్బంది ఈగ సుదర్శన్ కు శాలువ పూలమాలలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సహకార సంఘ మెంబర్లు మాట్లాడుతూ 1990 నుండి నేటి వరకు 36 సంవత్సరాలుగా ఇంచార్జ్ సెక్రెటరీగా, సెక్రటరీ గా, ఇప్పుడు స్టాఫ్ మెంబర్ గా చాలా నిజాయితీగా పనిచేసిన వ్యక్తి ఈగ సుదర్శన్ అని తెలిపారు. గతంలో ఆయనపై నిందలు వేసి కొన్ని అన్నివార్య కారణాల వల్ల సహకార సంఘం నుండి సస్పెండ్ చేశారని, మళ్లీ 2020లో సంజీవరెడ్డి పిరెడ్ లో ఆపాయింట్ మెంట్ చేసుకున్నారని తెలిపారు. సహకార సంఘంలో ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఆయన పదవీ విరమణ పొందడం చాలా బాధాకరమని అన్నారు. అదేవిధంగా సహకార సంఘంలో మళ్లీ తాత్కాలికంగా ఆయనను విధుల్లోకి తీసుకోవాలని సహకార సంఘ మెంబర్లు, రైతులు కోరారు. అనంతరం ఈగ సుదర్శన్ మాట్లాడుతూ.. సహకార సంఘంలో 36 సంవత్సరాలుగా పనిచేసిన ఎలాంటి గుర్తింపు లేదని, బెనిఫిట్స్ కూడా రాలేవని, కావున గ్రామ సర్పంచ్, సహకార సంఘ మెంబర్లు, గ్రామ పెద్దలు సహాయ సహకారాలు అందించేందుకు తోడ్పడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గుర్ల గోపి, ఏముల గజేందర్, తోట శంకర్ పటేల్, అడప శంకర్, బొట్టే గజేందర్, సురేష్, సాగర సంఘ సిబ్బంది, గ్రామ పెద్దలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

 

Sudarshan's services to the cooperative society will never be forgotten.