- జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి సన్మాన సభను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి కోరారు. నగరంలోని కాంగ్రెస్ భవన్ లో రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాను అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లాలని సుదర్శన్ రెడ్డికి ముఖ్య సలహాదారులుగా నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో మంత్రిగా జిల్లాకు ఎన్నో సేవలు సుదర్శన్ రెడ్డి చేసారని అన్నారు. నిరంతరం ప్రజల కోసం ఆలోచించే నాయకుడికి మంత్రి హోదా ఇవ్వడం సంతోషకర విషయం అని తెలిపారు. ముఖ్య సలహాదారులుగా నియమితులైన తర్వాత మొదటి సారీ జిల్లాకు సుదర్శన్ రెడ్డి వస్తున్న సందర్భంగా ఘనంగా స్వాగతం పలకడం జరుగుతుందని అన్నారు. మాధవ్ నగర్ సాయి బాబా మందిరం నుండి బైక్ ర్యాలీ మధ్యాహ్నం 1 అమలకు ప్రారంభం అవుతుందని తెలిపారు. అక్కడి నుండి పాత కలెక్టర్ గ్రౌండ్ చేరుకుని మధ్యాహ్నం 2 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాల్గొని సభను విజయవంతం చేయాలని మానాల మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్, పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, మాజీ పిసిసి ప్రధాన కార్యదర్శి నాగేష్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, శ్రీనివాస్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.