ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన సుదర్శన్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బుధవారం హైదరాబాదులోని సచివాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఛాంబర్లో సుదర్శన్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి ఇటీవల క్యాబినెట్ హోదాతో ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన విషయం తెలిసిందే. బాధ్యతలను స్వీకరించిన సుదర్శన్ రెడ్డిని రాష్ట్ర పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, వాకిటి శ్రీహరి, లక్ష్మణరావు, ఎమ్మెల్యేలు డాక్టర్ భూపతిరెడ్డి,...