Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 November 2025, 3:32 pm Posted by : ramakrishna

ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన సుదర్శన్ రెడ్డి

హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బుధవారం హైదరాబాదులోని సచివాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఛాంబర్లో సుదర్శన్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి ఇటీవల క్యాబినెట్ హోదాతో ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన విషయం తెలిసిందే. బాధ్యతలను స్వీకరించిన సుదర్శన్ రెడ్డిని రాష్ట్ర పీసీసీ చీఫ్

Sudarshan Reddy takes charge as government advisor

మహేష్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, వాకిటి శ్రీహరి, లక్ష్మణరావు, ఎమ్మెల్యేలు డాక్టర్ భూపతిరెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, వెంకటరమణ రెడ్డి, ఆది శ్రీనివాస్ లోతోపాటు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ మంత్రి జానారెడ్డి తోపాటు జిల్లాకు చెందిన చైర్మన్లు తహర్బిన్ హందాన్, మానాల మోహన్ రెడ్డి, ఇరవత్రి అనిల్, రాష్ట్ర వ్యవసాయ రైతు కమిషన్ సభ్యులు గడుగంగాధర్, నుడా చైర్మన్ కేశవేణు, నాయకులు రత్నాకర్ తదితరులు సుదర్శన్ రెడ్డికి కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Sudarshan Reddy takes charge as government advisor