కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి ముత్యాల సునీల్ కుమార్
బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరపున అధిష్టానానికి విన్నపం
మోర్తాడ్, బతుకమ్మ : బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రి పదవిని కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. ఈవిషయమై బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరపున అధిష్టానానికి విన్నవించారు. జిల్లాకు మంత్రి లేక అభివృద్ధి కార్యక్రమాల్లో కొంతవరకు ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. జిల్లా ఇన్ చార్జి మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు సమర్థవంతంగా తన విధులను నిర్వహిస్తున్నప్పటికీ ఆయనకు తన జిల్లాతో పాటు రాష్ట్రమంతా వ్యవహారాలు ఉండడంతో అత్యధిక సమయాన్ని కేటాయించలేకపోతున్నారని తెలిపారు. మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్ రెడ్డి అవకాశం కల్పించాలని ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.