Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 March 2025, 8:13 pm Posted by : ramakrishna

సుదర్శన్ రెడ్డి అంటేనే అభివృద్ధి

  • ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరదబట్టు వేణు రాజ్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సుదర్శన్ రెడ్డి అంటేనే అభివృద్ధి అని ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరదబట్టు వేణు రాజ్ అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ , త్రిబుల్ ఐటీ కాలేజ్ బాసర్, నిజామాబాద్ మెడికల్ కాలేజ్, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఇలాగా అనేక అభివృద్ధి  పథకాలను అందించింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అని తిపారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి నియోజకవర్గంలో సుధపల్లి లో  120 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరు చేపించారని తెలిపారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పైన, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి  పైన బిజెపి నాయకుడు నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం జిల్లా కాంగ్రెస్ భవన్ లో  ఎన్.ఎస్.యు. ఐ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరదబట్టు వేణు రాజ్ ఆధ్వర్యంలో  విలేకరుల  సమావేశం నిర్వహించారు. జవహర్ నవోదయ మంజూరు విషయమై ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి పై దిగజారుడు మాటలు మాట్లాడిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ పార్లమెంట్ సభ్యుడు అనే విషయం మర్చిపోయి సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పెద్దలను ఎలాగా గౌరవించాలి తెలియని సంస్కారహీనుడు ఎంపీ అరవింద్ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నరందీప్, కాంగ్రెస్ నాయకులు కిరణ్ రెడ్డి,ఎన్ ఎస్ యు ఐ నాయకులు  శివ. సాయికిరణ్, హరీష్, నరందీప్, సందీప్ ,కౌశిక్, అభిలాష్, రాహుల్, జాన్, రేవంత్, తదితరులు పాల్గొన్నారు.