రూ.14 కోట్లతో అభివృద్ధి పనులకు సుదర్శన్ రెడ్డి శంకుస్థాపన
కమ్మర్ పల్లి, బతుకమ్మ : మానాల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి,నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి అన్నారు. కమ్మర్‌పల్లి మండలం మానాల గ్రామంలో సుమారు రూ.14 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, నాయకులకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మానాల గ్రామం ఎదుర్కొంటున్న సాగు, తాగునీటి...