Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 January 2026, 9:06 pm Posted by : ramakrishna

మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సుదర్శన్ నాయక్

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండల సర్పంచుల పోరంల అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకున్నారు. సర్పంచుల మండల అధ్యక్షునిగా సుదర్శన్ నాయక్,ప్రధాన కార్యదర్శిగా పడాల రోహిత్ గౌడ్, ఉపాధ్యక్షులుగా గణేష్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులుగా ఎన్నికైన సుదర్శన్ నాయక్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సర్పంచ్ లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రానున్న రోజులలో అభివృద్ధి పనులు జరిగేలా కృషి చేస్తామని అన్నారు. ఏ గ్రామంలోనైనా ఏ సర్పంచ్ కి ఆపద వచ్చిన ముందుండి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అధ్యక్ష,కార్యదర్శులు, తెలిపారు. ఈ కార్యక్రమంలో లోకని గంగామణి గంగారం, చింతల కిషన్,కరుణ శ్రీనివాస్, సంగీత దిలీప్, శిరీష మైపాల్,రాజు,హరి సింగ్, భారతి జగత్ పవర్, మేనా గంగాధర్, వనిత కుమారులు పాల్గొన్నారు.