విజయవంతంగా కొనసాగుతున్న స్లాట్ బుకింగ్ విధానం

ఆర్మూర్, బతుకమ్మ  : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ విధానం ఏప్రిల్ 10 నుండి ఆర్మూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజయవంతంగా అమలవుతోంది. ఈ విధానంలో ప్రజలు తమకు అనుకూల సమయానికి స్లాట్ బుక్ చేసుకుని, లైన్లలో వేచి ఉండకుండా వేగంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు.  ప్రతి రోజు సగటున 48 డాక్యుమెంట్లు ఈ విధానంలో రిజిస్టర్ అవుతున్నందున, కార్యాలయ పనితీరు మరింత పటిష్టంగా మారింది. అయితే, కొన్ని సందర్భాల్లో, నిర్ణీత సమయానికి హాజరుకాక ఆలస్యం జరిగితే, ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ విషయంపై...