సమిష్టి కృషితోనే విజయం
బతుకమ్మ,మోర్తాడ్: మహిళా సహకార సంఘాలు సమిష్టి కృషితో అన్ని రంగాల్లో రాణిస్తున్నాయని డిపిఎం మారుతి అన్నారు. నూతనంగా ఎన్నికైన జనరల్ బాడీ సభ్యులు అంకితభావంతో నిబద్ధతతో అందరూ కలిసికట్టుగా పనిచేసే సహకార సంఘాల అభివృద్ధికి సహకరించాలని ఆయన పేర్కొన్నారు. మోర్తాడ్ మండలంలోని వడ్యాట్ గ్రామంలో మండల మహిళా సమైక్య 19వ సాధారణ సమావేశం శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2024-25 ఆర్థిక సంవత్సర లావాదేవీలు, నూతన పాలకవర్గం ఎన్నిక తదితర అంశాలను గురించి వివరించుకోవడం జరిగింది. నూతన...