బతుకమ్మ,మోర్తాడ్: మహిళా సహకార సంఘాలు సమిష్టి కృషితో అన్ని రంగాల్లో రాణిస్తున్నాయని డిపిఎం మారుతి అన్నారు. నూతనంగా ఎన్నికైన జనరల్ బాడీ సభ్యులు అంకితభావంతో నిబద్ధతతో అందరూ కలిసికట్టుగా పనిచేసే సహకార సంఘాల అభివృద్ధికి సహకరించాలని ఆయన పేర్కొన్నారు. మోర్తాడ్ మండలంలోని వడ్యాట్ గ్రామంలో మండల మహిళా సమైక్య 19వ సాధారణ సమావేశం శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2024-25 ఆర్థిక సంవత్సర లావాదేవీలు, నూతన పాలకవర్గం ఎన్నిక తదితర అంశాలను గురించి వివరించుకోవడం జరిగింది. నూతన మండల మహిళా సమైక్య అధ్యక్షురాలుగా లత (డోన్కల్), కార్యదర్శిగా లావణ్య (సుంకేట్), కోశాధికారిగా వరలక్ష్మీ (మోర్తాడ్) ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా ఎన్నుకున్న కార్యవర్గ సభ్యులతో సిసి తడకల శ్రీనివాస్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఏపీఎం ప్రమీల, మహేందర్, శ్రీనివాస్, రాజేశ్వర్, మోహన్, స్వప్న, గ్రామ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.