Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 October 2025, 5:29 pm Posted by : ramakrishna

నేడు ఎమ్మెల్యే చేతుల మీదుగా సబ్సిడీ విత్తనాలు పంపిణీ

  • మద్నూర్ వ్యవసాయ అధికారి ఏవో రాజు

 

మద్నూర్, బతుకమ్మ: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు చేతులు మీదుగా ఈనెల 22న మద్నూర్ రైతు వేదిక యందు జాతీయ ఆహార భద్రత, పోషణ మిషన్ పథకం ద్వారా రైతులకు సబ్సిడీపై శనగ విత్తనాలు పంపిణీ కార్యక్రమం జరుగనుందని వ్యవసాయ మండల అధికారి ఏవో రాజు తెలిపారు. 420 బస్తాల శనగ విత్తనాలు సబ్సిడీపై పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. కావున మండల రైతులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయగలరని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.