Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 September 2025, 5:41 pm Posted by : ramakrishna

అనుబంధ రుణాలు సద్వినియోగం చేసుకోవాలి

బతుకమ్మ,ఏర్గట్ల : ఐకెపి శాఖ ద్వారా వ్యవసాయ అనుబంధ రంగ అభివృద్ధి కోసం దేశీ కోళ్లు, గొర్రెల పెంపకం దారులకు అందిస్తున్న రుణాలను మహిళా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కమ్మర్ పల్లి సొసైటీ డైరెక్టర్ కోరిపల్లి లింగారెడ్డి,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోళ్ళ  శివకుమార్ పేర్కొన్నారు. బుధవారం ఏర్గట్ల ఐకెపి కార్యాలయంలో 22 మంది లబ్ధిదారులకు ఐకెపి ఫామ్ విభాగం కింద మంజూరైన 11 లక్షల సామాజిక పెట్టుబడి నిధి రుణాలను  పంపిణీ చేశారు.  మహిళా సంఘ సభ్యులు రుణాలను తీసుకోవడంతో పాటు ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని వారు సూచించారు. ఇట్టి సందర్భంలో ఐకెపి ఎపిఎం కుంట గంగాధర్ మాట్లాడుతూ ఐకెపి-సెర్ప్ ఫామ్ విభాగం కింద వ్యవసాయ అనుబంధ రంగాలైన దేశీ కోళ్ల పెంపకం, గొర్రెలు మేకల పెంపకం దారులకు ప్రత్యేకంగా ఈ రుణాలను సామాజిక పెట్టుబడినిధి రుణం పేరుతో మంజూరు చేయడం జరిగిందని వివరించారు.ఇట్టి రుణాల తో మండలంలోని తొర్తి గ్రామంలో రజిత అనే సభ్యురాలు దేశీ కోళ్ల పెంపకం యూనిట్  మంజూరు చేయడం జరిగిందని,ఏర్గట్ల, గుమ్మిర్యాల్, రెండు గ్రామాలలో ముగ్గురు రైతులకు రెండు లక్షల చొప్పున గొర్రెలు మేకలు పెంపకం కొరకు రుణం మంజూరు చేయడం జరిగిందని అదేవిధంగా మరో 19 మందికి ఐదువేల నుంచి 20వేల వరకు పెరటి కోళ్ల పెంపకం కొరకు ఇట్టి రుణాలు మంజూరు చేయడం జరిగిందని వివరించారు. కేవలం 50 పైసల వడ్డీతో లబ్ధిదారులు నిర్ణీత వాయిదాలలో ఈ రుణాన్ని తిరిగి  చెల్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు కుందన లక్ష్మి,ఏర్గట్ల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి,గడ్డం జీవన్ రెడ్డి,ముస్కు మోహన్ రెడ్డి, బద్దం లింగారెడ్డి,నరేష్,  సీసీలు రాజేశ్వర్ అలేఖ్య, ఏర్గట్ల గ్రామ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జక్కాని లక్ష్మి, మండల సమాఖ్య సిబ్బంది సుప్రియ, జహేద వివోఏ లు బోడ రాజ్ కుమార్ రజిత మహిళలు లబ్ధిదారులు పాల్గొన్నారు.