Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 August 2025, 6:12 pm Posted by : ramakrishna

తహసీల్దార్ కు వినతిపత్రం అందజేత

బతుకమ్మ, కోటగిరి : పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్)ఆధ్వర్యంలో కోటగిరి మండల తహసిల్దార్ గంగాధర్ కు పెన్షన్  విధానాన్ని రద్దు చేయాలనీ వినతి పత్రం అందించారు., అదేవిధంగా మండలంలోని ఉపాధ్యాయులందరూ వారి  పాఠశాలలో  పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనను వ్యక్తం  చేశారు. ఈ సందర్బంగా తపస్ నాయకులు మాట్లాడుతూ…. సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి మునపటి విధంగా ఓ పి ఎస్ ను వర్తింపచేయాలని కోరడం జరిగింది ఇట్టి మా యొక్క విన్నపాలను సీఎం వద్దకు తీసుకెళ్లి ఓ పి ఎస్ అమలు జరిగేటట్టు చూడవలసిందిగా కోరడం జరిగిందని తెలిపారు.. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు  మహాజన నర్సింలు  మండల ప్రధాన కార్యదర్శి లోగం రాజేష్  ,సభ్యులు శ్రీ తమ్మలి సంతోష్ కుమార్ , శచెన్నూరు ప్రశాంత్ గారు,  మచ్చ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.