ఆర్డీవోకు వినతి పత్రం అందజేత

బతుకమ్మ,మెండోరా: మెండోరా మండలంలో జరుగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ఆర్మూర్ ఆర్డీవో రాజా గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా మెండోరా ఉపాధ్యాయుల పక్షాన కులగనన సర్వే గౌరవ వేతనం చెల్లించాలని వినతిపత్రం అందజేయడం జరిగింది. ఏడు నెలల గడుస్తున్న ఇంతవరకు గౌరవ వేతనం చెల్లించలేదని వారు కోరారు. ఆర్డీవో స్పందిస్తూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య  పరిష్కరిస్తా మని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు ఓ.రమేష్, శ్రీనివాస్, మోహన్,రఘు నర్సింలు,ప్రభాకర్ నుస్రత్ తదితరులు పాల్గొన్నారు.