బోధన్ డిపో మేనేజర్ కు వినతిపత్రం అందజేత
రుద్రూర్, బతుకమ్మ: రైడ్స్ అధ్యక్షులు కర్రోళ్ల కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం బోధన్ బస్ డిపో మేనేజర్ విశ్వనాధ్ ను కలిసి రుద్రూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అంగడి బజార్ లో బస్ ఎక్కి, దిగడానికి అనుమతించే విధంగా వారి సిబ్బందికి ఆదేశాలు జారీ చేయాలనీ, అలాగే రుద్రూర్ బస్టాండ్ లో టాయిలెట్స్ ను కూడా అందుబాటులోకి తేవాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైడ్స్ ఉపాధ్యక్షులు, కోశాధికారి, గౌరవ సలహాదారులు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.