Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 March 2025, 12:29 pm Posted by : ramakrishna

ఏసీబీ ట్రాప్ లో సబ్ రిజిస్ట్రార్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  నిజామాబాద్ సబ్ రిజిస్ట్రార్ ఒకరు ఏసీబీకి చిక్కారు. జిల్లా కేంద్రంలోని కవిత కాంప్లెక్స్ లోని సోమవారం ఉదయం నిజామాబాద్ అర్బన్  స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్  కార్యాలయంలో రెండో సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వర్తిస్తున్న రామ రాజు ఏసీబీకి చిక్కారు. గత కొంత కాలంగా రెగ్యులర్ సబ్ రిజిస్ర్టార్ లపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. రామరాజు ఓ వ్యక్తి నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లు కేంద్రంగా ఆర్థిక లావాదేవీలు జరుగుతుండేవి. రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు వచ్చిన తరువాత దస్తావేజు లేఖరులను పట్టించుకోకుండా నేరుగా లంచాలు తీసుకుంటూ శ్రీరామరాజును వారే ప్లాన్ ప్రకారం పట్టించారని ఆరోపణలున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Sub-Registrar in ACB trap