Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 5:17 pm Posted by : ramakrishna

రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ

 

వెబ్ డెస్క్, బతుకమ్మ:

శవాల మీద పేలాలు ఎరుకుంటారు అనేది సామేత. కానీ నేటి రోజుల్లో అది నిజం అవుతుంది.  ఓ మహిళ ఆత్మహత్యకు ముందు మాట్లాడిన చివరి సెల్ ఫోన్ కాల్ నీదే. ఆమె ఆత్మహత్యకు కారకుడివి నీవే. లంచం ఇస్తావా లేదా కేసు పెట్టి జైలుకు పంపాలా అని బెదిరించి ఒక వ్యక్తి నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా ఎస్ఐని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ ఎస్ ఐ జి రమేష్ రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖాధికారులు  పట్టుకున్నారు. బజార్ హత్నూర్ పోలిస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. అమే చనిపోయే ముందు ఓ వ్యక్తితో చివరగా మాట్లాడింది. కేసు దర్యాప్తులో గుర్తించిన ఎస్ఐ రమేష్ సదరు వ్యక్తిని రూ.50 వేల లంచం డిమాండ్ చేశారు. చివరకు 40 వేలు ఇవ్వాలని కోరగా భాదితుడు ఎసిబిని ఆశ్రయించగా ఎస్ ఐ ని పట్టుకుని అరెస్టు చేశారు.