Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 December 2024, 4:56 pm Posted by : ramakrishna

ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించిన సబ్ కలెక్టర్

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి గురువారం పరిశీలించారు. సబ్ కలెక్టర్ లబ్ధిదారులతో మాట్లాడుతూ  మీరు ఇండ్లు కట్టుకుంటే ఇందిరమ్మ బిల్లులు సకాలంలో చెల్లిస్తామని తెలిపారు. అందుకోసమే ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి లబ్ధిదారునికి ఖాళీ స్థలం ఉంటే తప్పకుండా ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ కాలనీలోని ప్రజలు పింఛన్ ఇప్పియ్యాలని వేడుకోగా ఎంపీడీవో కార్యాలయంలో వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని అలాగే మీకు 57 సంవత్సరాలు నిండినట్లయితే తప్పకుండా పింఛన్ వస్తుందని తెలిపారు. సబ్ కలెక్టర్ వెంట ఎంపీడీవో కమలాకర్, ఎంపీ ఓ యాదగిరి, కార్యదర్శి బలరాం, కాంగ్రెస్ నాయకులు హనుమ, అశోక్, గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు.