Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 December 2024, 5:06 pm Posted by : ramakrishna

ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించిన సబ్ కలెక్టర్

 బతుకమ్మ, పిట్లం :  పిట్లం మండలంలోని చిన్న కొడప్ గల్ గ్రామంలో గురువారం గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను సబ్ కలెక్టర్ కిరణ్మయి పరిశీలించారు.ఈ సందర్భంగా  మాట్లాడుతూ….ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా గ్రామంలోని అర్హులైన ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరుపుతున్న మొబైల్ యాప్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ధర్మారం టోల్ ప్లాజా వద్ద నూతనంగా నిర్మాణానికి సిద్ధంగా ఉన్న పెట్రోల్ బంకును  సబ్ కలెక్టర్ పరిశీలించి తగు సూచనలు చేశారు. పెట్రోల్ బంక్ నియమ నిబంధనలతో నిర్మించాలని యజమానికి సూచించారు. ఆమె వెంట పిట్లం తాసిల్దార్ వేణుగోపాల్ గౌడ్, ఎంపీడీవో కమలాకర్, ఆర్ఐ సీతల్ సిబ్బంది ఉన్నారు.