చెక్ పోస్టు గుండా వేళ్లే ప్రతివాహనం తనిఖీ చేయాలి
. . . ఆక్రమ రవాణ గురించి అధికారులకు సమాచారం ఇవ్వాలి
పోతంగల్ , బతుకమ్మ:
పోతంగళ్ మండలంలో మంజీరా నది మొదటి బ్రిడ్జి వద్ద ఏర్పాటుచేసిన ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టును బోదన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఆకస్మిక తనిఖీ చేసారు. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్ధులోని చెక్ పోస్టును సబ్ కలెక్టర్ తనిఖీ చేసినప్పుడు పోలీస్ , రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. చెక్ పోస్ట్ సిబ్బందికి తగిన సూచనలు జారీ చేసినారు. వచ్చి పోయే ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని అదేశించారు. వాహనాలలో అక్రమంగా ఇసుక, ధాన్యము, నగదు, మద్యము ఏమైనా రవాణా జరిగినట్లయితే వాహనాలను ఆపి సంబంధిత అధికారులకు వెంటనే తెలియజేయవలసినదిగా సబ్ కలెక్టర్ వికాస్ అక్కడ ఉన్న సిబ్బందికి ఆదేశించారు. సబ్ కలెక్టర్ తో పాటు పోతంగల్ తహసీల్ధార్ తదితరులు ఉన్నారు.