ఎమ్మార్వో ఆఫీస్ ను సందర్శించిన సబ్ కలెక్టర్

మోర్తాడ్, బతుకమ్మ : మోర్తాడ్ తాసిల్దార్ కార్యాలయాన్ని గురువారం సబ్ కలెక్టర్ అభిజ్ఞ మాల్వియా సందర్శించారు. రెవెన్యూ సదస్సులకు సంబంధించిన విషయాలను, రేషన్ కార్డులకు సంబంధించిన రికార్డులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త తీసుకోవాలని అధికారులను సూచించారు. కార్యక్రమంలో మోర్తాడ్ ఎమ్మార్వో కృష్ణ, ఆర్ ఐ రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.