ప్రజావాణి లో 4 వినతులను స్వీకరించిన సబ్ కలెక్టర్
ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైందని ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ తెలిపారు. ఇక నుంచి ప్రతి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ సమస్యలకు సంబంధించిన 4 వినతులను సబ్ కలెక్టర్ స్వీకరించారు. వినతులను పరిశీలించి వీలైనంత తొందరగా సమస్యలను పరిష్కరిస్తానని ఫిర్యాదు దారులకు హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విభాగ స్థాయి అధికారులు, ఫిర్యాదు దారులు పాల్గొన్నారు.