సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించిన సబ్ కలెక్టర్ కిరణ్మయి
బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి రాజకీయ,కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే )ను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మంగళవారం పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను సబ్ కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్ సర్వేలో భాగంగా కుటుంబ వివరాలను అడిగి నమోదు చేస్తుండగా సబ్ కలెక్టర్ పరిశీలించారు. సర్వేకు సంబంధించిన వివరాలను ఎన్యుమరేటర్ ను సబ్ కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఎన్యుమరేటర్ కుటుంబ...