వరద ప్రాంతాలు పరిశీలించిన సబ్ కలెక్టర్ కిరణ్మయి

మద్నూర్, బతుకమ్మ:  జుక్కల్, మద్నూర్, డోంగ్లి ప్రధాన రహదారి మధ్యన ఉన్న అంతపూర్,తడ్గుర్ వాగులు పొంగిపొర్లయి, అదేవిధంగా దిగువ భాగాన ఉన్న సోమూర్,  చిన్న ఎక్లార, లింబూర్, వాడి గ్రామాల మధ్యలో ఉన్న లో లెవెల్ వంతెనల పై నుండి వరద పారడం తో రోడ్లు పాడయి పోయాయి.  ఈ ప్రాంతాలను సందర్శించిన బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ... పాడైపోయిన రోడ్లకు వెంటనే తాత్కాలిక మరమ్మత్తులు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. మద్నూర్, జుక్కల్, రహదారిలో అంతపూర్ తడ్గుర్ వద్ద వాగు...