సాలూర పిహెచ్‌సి లో సబ్ కలెక్టర్ తనిఖీ
బతుకమ్మ బోధన్: బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మాతో సాలూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్య సేవలు, సిబ్బంది హాజరు, ఔట్‌పేషెంట్, ప్రయోగశాల, ఫార్మసీ సదుపాయాలను పరిశీలించారు. హెచ్ఎంఐఎస్, ఐడీఎస్పీ, ఎంసీహెచ్, ఆయుష్మాన్ భారత్ పోర్టల్స్‌లో డేటా ఎంట్రీ, నివేదికల సక్రమతను సమీక్షించి సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు.