ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

బాన్సువాడ, బతుకమ్మ  : బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామపంచాయతీ పరిధిలోని ఠాగూర్ జూనియర్ కళాశాలలో ఇంటర్‌ పరీక్ష  కేంద్రాన్ని సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల తీరును పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో మొత్తం విద్యార్థుల సంఖ్య, హాజరైన విద్యార్థుల సంఖ్యను ప్రిన్సిపల్ మైషయ్యతో అడిగి తెలుసుకున్నారు.మాస్ కాపీ జరగకుండా చూడాలని, విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయలను పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేయాలని కళాశాల యజమాన్యాన్ని ఆదేశించారు. పరీక్షలు పకడ్బందీగా సజావుగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.