Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 August 2025, 4:16 pm Posted by : ramakrishna

వరద ప్రభావిత ప్రాంతాలు పరిశీలించిన సబ్ కలెక్టర్

 చందూర్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో , చందూర్ తహసీల్దార్ తో కలిసి చందూర్ మండలంలో వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఎస్‌.సి. కాలనీతో పాటు లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో మునిగిపోవడంతో పరిస్థితిని పరిశీలించారు. ప్రభావిత ప్రజలను ముందస్తు జాగ్రత్త చర్యగా చందూర్ జడ్‌పిహెచ్‌ఎస్ పాఠశాలలోకి తరలించి, వారికి అవసరమైన వసతి, ఆహార సదుపాయాలు కల్పించారు. ఈ సందర్బంగా సబ్ కలెక్టర్ వికాస్ మాతో అగ్నిమాపక శాఖ అధికారులు, రుద్రూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్‌తో సమావేశమై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన చోట తక్షణ సహాయం అందించాలని ఆదేశించారు. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక చర్యలు కొనసాగిస్తామని తెలిపారు.

Sub-Collector inspects flood-affected areas