ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన సబ్ కలెక్టర్
బతుకమ్మ, బోధన్: బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో పంచాయతీ కార్యదర్శితో కలిసి రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ హౌసింగ్ పథకం కింద మంజూరైన ఇళ్లకు సంబంధించిన మార్కింగ్‌లు, బేస్ లెవెల్ నిర్మాణ పనుల ప్రగతిని సమీక్షించారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించిన స్థితిని సబ్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా, ఆయా లబ్ధిదారులను ప్రోత్సహించడంతో పాటు వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాల్సిందిగా పంచాయతీ కార్యదర్శికి సూచనలు జారీ చేశారు. అలాగే, పథకం కింద మంజూరయ్యే నిధులు దశలవారీగా...