పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సబ్ కలెక్టర్
మద్నూర్, బతుకమ్మ: ఈ నెల 27వ తేదీన జరగబోయే పట్టభద్రుల, ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను శుక్రవారం మద్నూర్ మండల కేంద్రంలోనీ ఉర్దూ మీడియం పాఠశాలలో ఉన్న రెండు పోలింగ్ కేంద్రాలను బాన్సువాడ సబ్ కలెక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయి పరిశీలించారు. రెండు తరగతి గదులను పరిశీలించారు. ఒకటి పట్టభద్రుల ఓటర్ల కొరకు, మరోటి ఉపాధ్యాయ ఓటర్ల కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. మండల పరిధిలో ధరఖాస్తు చేసుకున్న ఓటర్లు...