. . . ఎన్ఐఏ విచారణాను సమర్ధించిన హైకోర్టు
నిజామాబాద్, బతుకమ్మ:
నిజామాబాద్ జిల్లాలో నిషేదిత ఫాపులర్ ప్రంట్ ఆఫ్ ఇండియా( పిఎఫ్ఐ) కార్యకలపాలను నిర్వహించిన వారిపై ఉపా చట్టం కింద విచారణను రాష్ట్ర హై కోర్టు సమర్ధించింది. 2022 లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జగిత్యాల జిల్లా కు చెందిన అబ్ధుల్ ఖాధర్, నిజామాబాద్ జిల్లా గుండారం కు చెందిన షేక్ షాధుల్లా, షేక్ ఇమ్రాన్ లు పిఎప్ఐ కార్యకలపాల నిర్వహణకు యువతకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ, ఆంద్ర రాష్ట్రాలలో నమోదైన ఎన్ఐఏ కేసులకు సంబంధించి బుధవారం రాష్ట్ర హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంగా 6వ టౌన్ పోలీస్ స్టేషన్ లో 36 మందిపై నమోదైన రెండు కేసుల విషయంలో నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఎన్ఐఏ) నమోదు చేసి విచారణ చేసిన కేసుల విషయంలో విచారణ సబబేనని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో ప్రధాన నిందితుడైన అబ్దుల్ ఖాదర్, షేక్ షాదుల్లా, మహ్మద్, ఇమ్రాన్ లపై నమోదు చేసిన ఉపా చట్టం కేసులో హైకోర్టు తీర్పు వెలువరించింది. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో పీఎఫ్ఐ కార్యకలాపాలలో పాలు పంచుకున్న వారిపై ప్రభావం చూపనుంది. తెలంగాణలోని ఉత్తర తెలంగాణ పీఎఫ్ఐ శిక్షణ వ్యవహరం ఎన్ఐఏకు విచారణకు ఆదేశించిన విషయం తెల్సిందే. తాజాగా హైకోర్టు ఎన్ఐఏ ఆదేశాలకు క్లియరెన్స్ ఇవ్వడంతో ఉమ్మడి జిల్లాలో సంచలనం రేపింది.