బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి
టీజీఎస్ సీపీసీఆర్ సభ్యురాలు హేమలత అగర్వాల్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తల్లిదండ్రులు లేరని ఆందోళన చెందకుండా పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఎదగాలని టీజీఎస్ సీపీసీఆర్ సభ్యురాలు హేమలత అగర్వాల్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల బాలసదనం, శిశు గృహ, సారంగాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ లను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాలసదనం శిశు గృహాలలో సౌకర్యాలు, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. శిశు గృహాన్ని సందర్శించి, పిల్లలకు అందిస్తున్న సౌకర్యాలు, ప్రభుత్వం...