Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 February 2026, 6:27 pm Posted by : ramakrishna

స్టడీ సర్కిల్ బియ్యం పక్కదారి

 

. . . రెండు క్వింటాళ్ల బియ్యంను పట్టుకున్న పోలీసులు

 

. . . నాందేవ్ వాడ ఎస్సీ హాస్టల్ వార్డెన్ నిర్వాకం

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

జిల్లా కేంద్రంలో ఎస్సీ స్టడీ సర్కిల్ కు చెందిన సన్న బియ్యం పక్కదారి పడుతుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం వెలుగు చూసింది. నాందేవ్ వాడ ఎస్సీ బాలుర వసతి గృహం వార్డెన్ జీవన్ ఎస్సీ స్టడీ సర్కిల్ హాస్టల్ కు ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఆదివారం ఉదయం హాస్టల్ నుంచి రెండు క్వింటల్ల సన్నబియ్యం ను ఆటోలో బయటికు తరలిస్తున్నారు. ఈ విషయం తెలిసిన కొందరు స్థానిక మూడో టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హాస్టల్ నుంచి తరలిస్తున్న బియ్యంను పట్టుకొని ఆరా తీశారు. జీవన్ తాను బియ్యం తరలిస్తున్న విషయం వాస్తవం అని ఒప్పుకున్నాడు. సంబంధిత వీడియో ను కొందరు రికార్డు చేసి బయటపెట్టారు. అది వైరల్ గా మారింది. ఈ విషయం జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది. హాస్టల్ వార్డెన్ జీవన్ మరో రెండు నెలల్లో పదవి విరమణ చేయాల్సి ఉండగా హాస్టల్ బియ్యం పక్కదారి పట్టిస్తూ దొరకడం కలకలం రేపింది. కొందరు ఈ విషయాన్ని బయటకు రాకుండా చేసేందుకు చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేయడం గమనార్హం.