రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు
బతుకమ్మ, మోర్తాడ్: గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల కోసం ఆహార భత్య చార్జీలు పెంచినందుకు గాను విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థులకు మరింత పోషకమైన, రుచికరమైన ఆహారం అందుబాటులోకి వస్తుందని, నిర్ణీత మెనూను అనుసరించడం సులభమవుతుందని విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో చేసే కృషి పట్ల విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో...