విజ్ఞాన ప్రదర్శనలో విద్యార్థుల ప్రతిభ

జుక్కల్, బతుకమ్మ: అగష్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి విజ్ఞాన ప్రదర్శన నిర్వహించారు. మండల కేంద్రంలోని నాగల్గావ్ గ్రామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మండల స్థాయి విజ్ఞాన ప్రదర్శన లో జల చక్రము, మానవుని యొక్క నాడి వ్యవస్థ గురించి చక్కటి పటాల ద్వారా వివరించారు. అందుకుగాను మండల స్థాయిలో రెండవ బహుమతి గెలుచుకున్నారు. విద్యార్థులకు అభినందించి బహుమతి అందించారు. ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులకు బహుమతి అందించారు.