Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 April 2025, 9:30 pm Posted by : ramakrishna

విద్యార్థులు మొదటి నుంచి లక్ష్యంతో చదవాలి

బతుకమ్మ,మోర్తాడ్: విద్యార్థులు పాఠశాలలో మొదటి నుంచి ఉన్నత లక్ష్యం ఏర్పాటు చేసుకొని చదివే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు మోటివేషన్ కలిగించాలని మోర్తాడ్ ఎంఈఓ సమ్మిరెడ్డి అన్నారు. మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో గల ఎంపియుపిఎస్ పాఠశాలలో నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవం, స్పోర్ట్స్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు న్యూత్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి. అలాగే చదువు విలువ అనే నాటకం విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శన తీరు గ్రామస్తులను అబ్బురపరిచారు. కార్యక్రమంలో కమ్మర్ పల్లీ ఎంఈఓ ఆంధ్రయ్య, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Students should study with a purpose from the beginning.