- జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మౌలిక సదుపాయాల కల్పన కు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఎల్లారెడ్డిపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పేరేంట్స్ టీచర్స్ సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థిని విద్యార్థులు చక్కగా చదువుకుని ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలనీ, భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజనీర్లు కాకుండా, లాయర్లుగా, బిజినెస్ మ్యాన్లుగా వివిధ అనేక రంగాల్లో రాణించవచ్చాన్నారు. విజయానికి పరిమితి లేదనన్నారు.ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ” తల్లిదండ్రులు- అధ్యాపకుల” సమావేశంకు ముఖ్య అతిథిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యాయి.విద్యార్థులకు పలు సలహాలు, సూచనలు చేశారు. కళాశాలలో ప్రహారీనీ, నూతన తరగతి గదుల నిర్మాణానికి కృషి చేస్తామనీ, గ్రామీణ ప్రాంతాలనుండి వచ్చే విద్యార్దులకు బస్సు సౌకర్యాలను కల్పిస్తామని , కళాశాలలో అవసరమయిన మౌలిక వసతులు కల్పిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థులు అకాడమిక్స్ తోపాటు పోటీ పరీక్షలకు కూడా సన్నద్దం కావాలన్నారు.ఈకార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వై.శ్రీనివాస్,కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.పద్మావతి, మార్కేట్ కమిటీ చైర్మన్ సబేరా బేగం గౌస్, ఎం.ఆర్.ఒ సుజాత, ఎం.పి.డి.ఒ జి.సత్తయ్య, నాయకులు దొమ్మాటి నర్సయ్య,గౌస్,సద్ది లక్ష్మారెడ్డి, రాంరెడ్డి,చెన్ని బాబు ,కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు,వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
