విద్యార్థులు కష్టపడి చదవాలి
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ నియోజకవర్గంలో అనేక కళాశాలలు ఏర్పాటు చేశామని.. విద్యార్థులు కష్టపడి చదవాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కోటగిరి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను బుధవారం సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. బాన్సువాడలో డిగ్రీ ఉర్దూ మీడియం, నర్సింగ్, ఫుడ్ టెక్నాలజీ, వ్యవసాయ, పాలిటెక్నిక్ కళాశాలలను ఏర్పాటు చేయించామన్నారు. అనంతరం జూనియర్ కళాశాలలో విద్యార్థులు అటెండెన్స్ రిజిస్టర్ను తనిఖీ చేశారు. గతేడాది వచ్చిన ఫలితాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సంఖ్యను,...