- జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
- గిరిజన సంక్షేమ హాస్టల్లో అట్టాహసంగా డైట్ కామెంట్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
- కోటగల్లి, ఎస్సీ బాలికల వసతి గృహాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
రుద్రూర్(వర్ని), బతుకమ్మ : రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టలల్లో ప్రతిష్టాత్మకంగా ఒకే విధమైన డైట్ ప్లాన్ ను ప్రవేశపెట్టగా జిల్లాలోని వివిధ వసతి గృహాలలో అధికారులు ప్రజాప్రతినిధులు శనివారం ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వర్ని మండలంలోని కోటే క్యాంపు గల గిరిజన ఆశ్రమ పాఠశాలలో శనివారం కామన్ డైట్ ప్లాన్ లాంచనంగా ప్రారంభించారు. పాఠశాలలోని స్టోర్ రూమ్ ను సందర్శించి కూరగాయలు, సరుకులు, ఆహార పదార్థాలను ఆయన పరిశీలించారు. సన్న బియ్యం, విజయ డైరీ పాల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులకు ప్రభుత్వపరంగా ఉచితంగా అందిస్తున్న యూనిఫామ్ లు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్కులను ఆయన పరిశీలించారు. అనంతరం వారి తల్లిదండ్రులతో కలిసి సహా పంక్తి భోజనం చేశారు. అదేవిధంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పాఠశాలలో అదనపు సదుపాయాలు అవసరం ఉన్నాయని గుర్తించిన కలెక్టర్ మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. విద్యార్థులు చక్కగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాల దిశగా ముందుకు సాగాలన్నారు. అన్ని సంక్షేమ వసతిగృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు వీలుగా ప్రభుత్వం కామన్ డైట్ ప్లాన్ ను ప్రారంభించిందని తెలిపారు. వసతి గృహాలు, పాఠశాలల విద్యార్థుల శ్రేయస్సు కోసం 40 శాతం డైట్ చార్జీలను, 200% కాస్మోటిక్ చార్జీలను పెంచడం జరిగిందన్నారు. తద్వారా పిల్లలకు పోషకాలతో కూడిన బలవర్థక ఆహారం అందించాలని, వారు మరింత మెరుగైన విద్యను అభ్యసించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపజేశాయి. జిల్లా కలెక్టర్ వెంట నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జిల్లా బీసీ సంక్షేమ సహాయ అధికారి నర్సయ్య, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి భూమయ్య, గిరిజన సంక్షేమ శాఖ ఏఓ బి. సహదేవ్, సంక్షేమ వసతి గృహాల నిర్వాహకులు రాధా రాణి, కల్పన తదితరులు ఉన్నారు.
