Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 July 2025, 7:47 pm Posted by : ramakrishna

విద్యార్థులు మారకద్రవ్యాలకు, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలి

మెండోరా, బతుకమ్మ: విద్యార్థులు మారకద్రవ్యాలకు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని మోర్తాడ్ ఎస్సై జాదవ్ సుహాసిని గురువారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. మెండోరా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో డ్రగ్స్ నివారణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఆపదలో ఉన్న స్త్రీల కోసం షీ టీం గురించి విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో మెండోరా విద్యాధికారి శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.