- జోస్ ఆలూకాస్ మేనేజర్ దానేష్
నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన విద్యావిధానం డిజిటల్ ఎడ్యుకేషన్ ను వినోయోగించుకొని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోయించాలని జోస్ ఆలూకాస్ మేనేజర్ దానేష్ హితావు పలికారు. గురువారం జిల్లా కేంద్రంలోని దుబ్బ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ కు ప్రముఖ జూవేళ్ళరీ షోరూం జోస్ ఆలూకాస్ వారి సీ ఎస్ ఆర్ ప్రోగ్రాం లో భాగంగా పాఠశాలకు టీవీ, ప్రింటర్లను విరాళంగా అందజేశారు. ఈ సందర్బంగా దానేష్ మాట్లాడుతూ మా సంస్థ అందించిన టీవీ, ప్రింటర్ల విద్యార్థులకు డిజిటల్ క్లాస్ లల్లో వినోయోగించుకోవాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్ అంతా విద్యాతోనేనని, డిజిటల్ విద్యా విధానం ద్వారా నాణ్యమైన విద్యను పొంది ఉన్నత స్థాయికి ఎదిగి మన కన్న దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లోఏ ఏ పీ సీ చైర్మన్ దాండే లక్ష్మి, ఎం ఈ ఓ(నిజామాబాద్ నార్త్)ఆర్ వి ఎన్ గౌడ్, కాంప్లెక్స్ హెచ్ ఎం. శ్రీనివాస్,హెచ్. ఎం ఆర్ బి వి రాజు,కేశవ్ కుమార్, మంజుల, ఏలిజిబెత్,సంతోష రాణి, లావణ్య, మోహన్ రెడ్డి లు పాల్గొన్నారు.
