విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయకూడదు
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ యాజమాన్యాలతో సమావేశంలో కలెక్టర్ నిజామాబాద్, బతుకమ్మ : బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద ప్రైవేటు పాఠశాలలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను యాజమాన్యాలు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకూడదని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కరెస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్ తో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆయా పాఠశాలల్లో ఈ పథకం కింద ఎంత మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు, ప్రస్తుతం ఎంతమంది కొనసాగుతున్నారు, వివిధ కారణాల వల్ల యాజమాన్యాలు...