. . . పిడిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎన్.బాల్ రాజ్
బాన్సువాడ, బతుకమ్మ :
వసతి గృహ వార్డెన్లు విద్యార్థుల పట్ల, వారి సౌకర్యాల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ఉండాలని పిడిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎన్.బాల్ రాజ్ అన్నారు. బాన్సు వాడ పట్టణం లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల హాస్టల్ ను విద్యార్ధి సంఘాల నాయకులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు భోజనం, మౌళిక వసతులపై ఇబ్బందులు ఉంటే ఎప్పటికప్పుడు వార్డెన్ కి తెలియజేయాలని అన్నారు. నాణ్యమైన భోజనం, మంచినీటి సౌకర్యం, మౌళిక వసతుల విషయంలో వార్డెన్ లు నిర్లక్ష్యం వహిస్తే విద్యార్థి సంఘాల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి ఉద్యమాలు చేయడానికైనా వెనుకానబోమని, విషయాలను అధికారుల వరకు తీసుకువెళ్లి కఠిన చర్యలు తీసుకునేలా చేస్తామని హాస్టల్ వార్డెన్ శివరాం కి తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు డిఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జీవన్ రాథోడ్, బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు సాయి బాబా, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా నాయకులు పుట్ట భాస్కర్ లు పాల్గొన్నారు.
