విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
మోర్తాడ్, బతుకమ్మ: రాబోయే పదవ తరగతి పరీక్షలకు విద్యార్థిని విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ ఈరవత్రి మారుతి అన్నారు. మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్ రావు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఏదైనా మనం సాధించాలనుకుంటే పాఠశాల నుండి మొదలవుతుంది ని పేర్కొన్నారు. పాఠశాల నుండి ఇంటికి వెళ్ళగానే వార్తా పత్రికలు, మంచి పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం వస్తుందని విద్యార్థులకు...