Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 October 2025, 4:37 pm Posted by : ramakrishna

విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి

మోర్తాడ్, బతుకమ్మ: రాబోయే పదవ తరగతి పరీక్షలకు విద్యార్థిని విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ ఈరవత్రి మారుతి అన్నారు. మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్ రావు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఏదైనా మనం సాధించాలనుకుంటే పాఠశాల నుండి మొదలవుతుంది ని పేర్కొన్నారు. పాఠశాల నుండి ఇంటికి వెళ్ళగానే వార్తా పత్రికలు, మంచి పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం వస్తుందని విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు స్పీకర్ ఇరవత్రి మారుతిని శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Students should move forward with confidence.