విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి
టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్ కామారెడ్డి, బతుకమ్మ : విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్ పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జహీరాబాద్ పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడే అవినీతి రహిత రాజకీయ వ్యవస్థలు ఏర్పడడం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకే దక్కిందని అన్నారు. విజన్...