–విద్యార్థుల తల్లిదండ్రుల వేడుకోలు
ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బ్లడ్ గ్రూప్ టెస్టుల కిట్లు లేవని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. దీంతో పేద విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఉచిత బ్లడ్ గ్రూపు టెస్టులు చేసేలా చూడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులు ఎంతోమంది ఉన్నారని పేర్కొన్నారు.వెంటనే ప్రభుత్వం స్పందించి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు రక్త పరీక్షలు చేసే విధంగా చర్యలు తీసుకొవలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు