దిగంబర్ రావు ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు రాణించాలి
బోధన్, బతుకమ్మ : మాతృశ్రీ విద్యాసంస్థలు 29వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఏఆర్ గార్డెన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి విద్యాసంస్థల కరస్పాండెంట్ సిరిగిరి జయశ్రీ దిగంబర్ రావు ఆధ్వర్యం వహించారు. ముఖ్య అతిథులుగా ఏసీపీ శ్రీనివాస్, సీఐ వెంకటనారాయణ, ఎంఈఓ నాగయ్య హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభంలో అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి, విద్యాసంస్థల అధినేత దివంగత సిరిగిరి దిగంబర్ రావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ బోధన్ పట్టణంలో విద్యా రంగానికి దిగంబర్ రావు చేసిన...